MPTC | రామగిరి ఎంపీపీ పదవి టీడీపీ కైవసం

MPTC | రామగిరి ఎంపీపీ పదవి టీడీపీ కైవసం

  • సాయిలీల ఏకగ్రీవం
  • అధికారికంగా ప్రకటించిన ఎన్నికల అధికారి సంజీవయ్య

MPTC | రామగిరి, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి ఎంపీపీగా సాయిలీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి సంజీవయ్య ఈ రోజు ప్రకటించారు. కుంటిమద్ది గ్రామానికి చెందిన సాయిలీల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. కాగా, రామగిరి మండల పరిధిలో పదిమంది ఎంపీటీసీ(MPTC)లు ఉండగా, ఎంపీపీగా ఉన్న ఈశ్వరమ్మ మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది.

ఇదిలా ఉండగా మొత్తం 9 మందికి గాను నలుగురు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ సమావేశం నాలుగొవది. గతంలో మూడు సార్లు సమావేశమ‌య్యారు. కానీ కోరం లేకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల నిబంధన మేరకు కోరం లేకపోయినా సమావేశంలో ఎంపీపీ ఎన్నిక నిర్వహించడం జరిగిందని ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్(Election Officer) సంజీవయ్య తెలిపారు.

సమావేశానికి నలుగురు ఎంపీటీసీలు హాజరవ్వగా.. సాయి లీల ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆమెను రామగిరి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

Leave a Reply