MPDO Mahender | వివో బిల్డింగ్ స్థల పరిశీలన

MPDO Mahender | వివో బిల్డింగ్ స్థల పరిశీలన
- భూమి దాత దాసరి అఖిల్ గౌడ్ కు ఎంపీడీవో, సర్పంచ్ సన్మానం
MPDO Mahender | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో మహిళా సంఘాల నూతన వివో భవనం నిర్మాణానికి సంబంధించి సర్పంచ్ చిలుముల శ్రీనివాస్, ఉపసర్పంచ్ గజెల్లి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో స్థలాన్ని బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్ శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా మహిళా సంఘాల అభ్యర్థన మేరకు వివో భవన నిర్మాణానికి భూమిని ఉచితంగా అందజేసిన భూదాత దాసరి అఖిల్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. మహిళా సాధికారతకు ఆయన చేసిన సేవను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈ విష్ణు, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొని భవన నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరారు. మహిళా సంఘాలకు శాశ్వత కార్యాలయం ఏర్పడితే వారి కార్యకలాపాలకు మరింత బలమవుతుందని పేర్కొన్నారు.
