మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి మున్సిపల్ కమిషనర్ గా బి.శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంపీడీవోగా పనిచేస్తున్న ఈయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న వెంకటరత్నం తిరిగి మేనేజర్ గా వెళ్లారు.