కాంగ్రెస్ తోనే మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ తోనే మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం
- ఎంపీ చామల, ఎమ్మెల్యే సామెల్
మోత్కూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీతోనే మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమౌతుందని ,ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామెల్ తో కలిసి వార్డు ఇంచార్జ్ లు,అభ్యర్థులతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థులు స్థానిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఓటర్ ని కలిసి ఓటు అభ్యర్ధించాలని,ప్రతి అభ్యర్థి కి అభివృద్ధి పనుల పట్ల విజన్ ఉండాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలు ,ఫోన్ నంబర్లు సేకరించి ఓటు అభ్యర్ధించాలన్నారు.ఈ సందర్భంగా ఎంపీ,ఎమ్మెల్యే లు పోటీలో ఉన్న అభ్యర్థులతో వార్డ్ వారీగా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల పట్ల వ్యూహం, పార్టీ అంతర్గత చర్చలు,స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు,ఓటర్ల మనోభావాలు తదితర అంశాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
మోత్కూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.11 వార్డులలో కాంగ్రెస్ పార్టీ, ఒక్క వార్డులో పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ సంధ్యారెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి,మండల ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ, గుండగొని రామచంద్రు, ఏపీఐడిసి మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరి రెడ్డి,జిల్లా నాయకులు డా గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి, పర్రెపాటి యుగంధర్,12 వార్డుల అభ్యర్థులు,వార్డు ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.
