ఎంపీ నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి కృషి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎంపీ డీకే అరుణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపోర్ల సర్పంచ్ బోయిన్ పల్లి కాశమ్మ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల ప్రధాన చెరువుకట్టపైముళ్లపొదలు తొలగించే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమస్యల పరిష్కారానికి పాటుపడుతానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తానన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడంతో పాటు గ్రామంలో డ్రైనేజీ సిసిరోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తాననిఅన్నారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ అభివృద్ధి పనులు చేపడుతాననిఅన్నారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవచేస్తాననిఅన్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలుచేసి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. పెద్దపూర్లా గ్రామంలోని ప్రధాన చెరువు కట్టపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుండగా ప్రజలకు అనుకూలంగా మారిందని పలువురుఆనందంవ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొల్లూరు మాధవి, మాజీ సర్పంచ్ రవికుమార్ వార్డు సభ్యులు బోయిన్పల్లి రమేష్, గ్రామస్తులు వెంకటేష్ నరేష్ కుమార్ వెంకటయ్య సంటి రాము గుంతలు కురుమయ్య సంటి రవి ఆనంద్ నర్వసాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply