move2forward | నభా… కమ్‌బ్యాక్‌తో రేంజ్ మారుతుందా?

move2forward | నభా… కమ్‌బ్యాక్‌తో రేంజ్ మారుతుందా?
move2forward | అడ్డంకుల మధ్య నభా ప్రయాణం
ఇస్మార్ట్ శంకర్‌తో వచ్చిన బ్రేక్
యాక్సిడెంట్ తర్వాత కమ్‌బ్యాక్ స్టోరీ
చేతిలో మూడు సినిమాలు… కీలక దశ
డ్యాన్స్, ఎనర్జీతో ప్రత్యేక గుర్తింపు
move2forward | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నభా నటేష్.. కెరీర్ లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. కష్టపడుతుంది. తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ కన్నడ బ్యూటీ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. బ్లాక్ కలర్ శారీలో.. అందచందాలతో అదరగొట్టేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇంతకీ.. ఇప్పుడు ఈ అమ్మడు ఏ సినిమాల్లో నటిస్తుంది..? అనుకుంటున్నారా..? అయితే.. ఈ బ్యూటీ కెరీర్ గురించి చెప్పాలంటే…

ఇస్మార్ట్ బ్యూటీ..
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందివ్వకపోయినా.. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నభా నటేష్.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. అయితే.. కెరీర్ స్పీడు అందుకుంటుంది అనుకున్న టైమ్ లో.. నభాకు యాక్సిడెంట్ అయ్యింది. దీని వలన కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.

అయినా క్రేజ్ తగ్గలేదు..
ఆతర్వాత ప్రియదర్శి నటించిన డార్లింగ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అయినప్పటికీ.. నభాకు క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలు ఉండడం విశేషం. ఇంతకీ.. ఆ సినిమాలు ఏంటంటారా..? స్వయంభు, నాగబంధం, టైసన్ నాయుడు. ఈ మూడు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంది. ఈ మూడు సినిమాలు నభా కెరీర్ కు కీలకం అని చెప్పచ్చు. స్వయంభు సినిమా పై నిఖిల్ చాలా నమ్మకంగా ఉన్నాడు. అలాగే నాగబంధం సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి పేరు వచ్చింది. టైసన్ నాయుడు ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు హిట్ అయినా.. నభా రేంజ్ మారిపోవడం ఖాయం.
ఆ విషయంలో స్పూర్తిగా నిలుస్తుంది..
నభా నటేష్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె డ్యాన్స్ మరియు ఎనర్జీ. పాటలలో ఆమె చూపించే ఉత్సాహం, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గ్లామర్‌తో పాటు సంప్రదాయ లుక్‌లో కూడా ఆమె అందంగా కనిపించడం మరో ప్రత్యేకత. సోషల్ మీడియాలో నభా నటేష్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తన ఫోటోలు, షూటింగ్ అప్‌డేట్స్, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఫ్యాషన్, ఫిట్నెస్ విషయంలో కూడా ఆమె చాలా మందికి స్పూర్తిగా నిలుస్తోంది. టాలీవుడ్‌లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని నభా నటేష్ గట్టిగానే కృషి చేస్తోంది. మంచి కథలు, బలమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగితే, ఆమె స్టార్ హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి.. త్వరలో తను అనుకున్న స్థానానికి చేరుకుంటుందేమో చూడాలి.
