Motor Vehicle Inspector | మైనర్లు వాహనాలు నడపకూడదు

Motor Vehicle Inspector | మైనర్లు వాహనాలు నడపకూడదు

  • మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ చంద్ర..

Motor Vehicle Inspector | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని మంచిర్యాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ చంద్ర అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం’ 2026 సందర్భంగా మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఈ రోజు మధ్యాహ్నం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ లను పెట్టుకోవాలన్నారు.

ఫోర్ వీలర్స్ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మైనర్లకు నడపడానికి వాహనాలు ఇస్తే సంబంధిత యజమానులపై కేసులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట కలిగి ఉండాలని, వాహనాలతో బయటకు వెళ్ళేటప్పుడు కండిషన్లను చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, కరస్పాండెంట్ ఎర్ర సంపత్, రాఘవేంద్ర లిటిల్ హన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డీన్ హేమలత షిండే, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply