Motkur | ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

Motkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ జన్మదిన సందర్భంగా మోత్కూర్ కి చెందిన బీఆర్ఎస్ నేతలు హైదరాబాదులోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిషోర్ ను శాలువాతో సన్మానించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ యాకుబ్ రెడ్డి, మాజీ రైతుబంధు సమతి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, 6వ వార్డు అధ్యక్షుడు కొనతం మహేందర్ రెడ్డి, యువ నాయకులు కంచర్ల క్రాంతి కుమార్ లో పాల్గొన్నారు.
