20 మందికి పైగా విద్యార్ధులకు తీవ్ర అస్వస్తత

20 మందికి పైగా విద్యార్ధులకు తీవ్ర అస్వస్తత

  • కామెర్లు, లివర్ సమస్యలు వెలుగులోకి
  • చికిత్స పొందుతూ 6 ఏండ్ల బాలుడు మృతి

హుజూర్ నగర్, మెల్లచెరువు, ఆంధ్రప్రభ : మెల్లచెరువు మండల కేంద్రంలో ఆరెంజ్ పాఠశాలకు చెందిన విద్యార్ధులు 20 రోజుల క్రితం వరుసగా వాంతులు జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్న విషయం లో తల్లిదండ్రుల పిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యం వైద్యాధికారుల సహాయంతో పాఠశాలలోనే మెడికల్ క్యాంపు(Medical Camp) పెట్టీ పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు రక్త పరీక్షలు చేపట్టారు. కలుషిత నీరు తాగడం వల్ల పిల్లలకు వాంతులు, జ్వరాలు వస్తున్నాయని డాక్టర్లు నిర్దారణ చేశారు. అంతవరకు బాగానే ఉన్న అప్పటికే అస్వస్తతకు గురైన విద్యార్ధులను మెరుగైన చికిత్స కోసం కోదాడ ఖమ్మం ప్రవైటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆ విద్యార్థులందరూ వాంతులు విరోచనాలు, జ్వరాలతో బాధపడుచూ జాండీస్ (కామెర్లు) లివర్ సంబధిత వ్యాధుల బారిన పడ్డారని డాక్టర్లు(doctors) నిర్ధారించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వారి పరిస్తితి మరింత దయనీయంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరెంజ్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న మెల్లచెరువుకు చెందిన షాగంరెడ్డి. సుజిత్ రెడ్డి (6) అనే బాలుడు అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు హాస్పటల్(hospital) కు తీసుకెళ్లగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీ, లివర్, కామెర్లు సమస్య ఉందని నిర్ధారించి చికిత్స చేస్తుండగా బాలుడు మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

ఆరెంజ్ పాఠశాలకు చెందిన మరికొంత మంది విద్యార్థులు ఇదే సమస్యతో అనారోగ్యానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం జరుగుతుందా అని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఒక్కొక్క విద్యార్థికి హాస్పటల్లో చికిత్స పొందుతున్న విద్యార్ధులకు రెండు నుంచి మూడు లక్షల ఖర్చు చేశామని తల్లిదండ్రులు(parents) చెప్పుకొస్తున్నారు. 6 సంవత్సరాల సుజిత్ రెడ్డి మృతి చెందడంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు.

విద్యా వైద్య శాఖ(educational medical department) ఉన్నతాధికారులు ఈ విషయంలో తక్షణమే స్పందించి ఆరంజ్ స్కూలును బందు చేసి ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులందరి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఇప్పటికే అస్వస్తతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్ధులకు కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు చేపట్టి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుకున్నారు.

ఆరెంజ్ పాఠశాల(Orange school) వాటర్ ట్యాంక్ లో కొండముచ్చు పడి మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్యాంక్ లో నుండి వచ్చే వాటర్ చెడు వాసన రావడంతో ట్యాంక్ ను పరిశీలించిన పాఠశాల సిబ్బంది ట్యాంక్ లో కొండముచ్చు పడి చనిపోయినట్లు గుర్తించి విషయం బయటకు రాకుండా చనిపోయిన కొండముచ్చును బయటకు తీసి వాటర్ ట్యాంకు క్లిన్ చేసి యధావిధిగా వాడుకున్నారు.

అప్పటికే చాలా రోజులుగా స్కూల్ విద్యార్ధులు ఆ నీటిని తాగడం దాని ప్రభావం చిన్న చిన్నగా వాంతులు విరోచనాలు జ్వరం రావడంతో గత అక్టోబరు 7 నుండి 30 రోజుల పాటు మండల వైద్య శాఖ అధికారులు వైద్య శిబిరం(medical camp) పెట్టీ అస్వస్థత కు గురైన విద్యార్ధులకు వైద్య పరీక్షలు చేశారు. విద్యార్ధుల బ్లడ్ శాంపిల్స్ తీసుకొని నీరు కలుషితం కావడం వల్లనే అని నిర్ధారించారు.

కానీ పాఠశాల యాజమాన్యం అసలు విషయాన్ని దాచిపెట్టడం తో ఒక నిండు ప్రాణం బలి అయ్యిందని తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు నిజ నిర్దారణ చేయాలని అదే జరిగితే సంబంధిత పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.

Leave a Reply