వానరం ఒడిలో కుక్కపిల్ల..

వానరం ఒడిలో కుక్కపిల్ల..

అమ్మ ప్రేమకు జాతి భాష రూపం బేధాలు లేవు…

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో హృదయాలను కదిలించే ఘటన చోటుచేసుకుంది. మనుషుల్లో మానవత్వం క్రమంగా తగ్గిపోతున్న ఈ కాలంలో ఓ వానరం చూపిన అపూర్వమైన మాతృత్వం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. మండుతున్న ఎండలో, దాహంతో, వేడితో అలమటిస్తూ అరుస్తున్న ఓ చిన్న కుక్కపిల్లను గమనించిన వానరం వెంటనే స్పందించింది.

ఆ బుజ్జి ప్రాణి పై జాలి వేసి, దానిని ఓ స్లాపు పై తన దగ్గరకు తీసుకుని, అంతేకాదు, ఎండ తగలకుండా తన గుండెలకు హత్తుకుని కాపాడింది. అమ్మ ప్రేమకు జాతి, రూపం, భాష అనే భేదాలు ఉండవని ఈ సంఘటన మరోసారి చాటి చెప్పింది. అక్కడ ఉన్న స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి కదిలిపోయారు. “మనుషులు కూడా ఇలా ప్రాణులపై ప్రేమ చూపిస్తే ఎంత బాగుంటుందో” అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

Leave a Reply