చేవెళ్ల జెడ్పిటిసీ ఎన్నికలకు..

చేవెళ్ల జెడ్పిటిసీ ఎన్నికలకు..
చేవెళ్ల, అక్టోబర్ 8 (ఆంధ్రప్రభ) : చేవెళ్ల జెడ్పిటిసి ఎన్నికల (Chevella ZPTC Election) రిటర్నింగ్ అధికారిగా ( జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ) మహమ్మద్ రియాజ్ (Muhammad Riaz) నియమితులయ్యారు ఈ మేరకు బుధవారం ఉదయం చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. మండల పరిషత్ కార్యాలయంలోని జడ్పిటిసి, ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందన్నారు అందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
