MODI | ఈ సమ్మిట్ నిర్వహణ దక్షిణాసియాకే గర్వ కారణం

MODI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏఐ కేంద్రంగా భారత్ మారుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏఐ విజన్ తో పాటు, సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యమన్నారు.
ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయని.. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి ఇప్పుడు ఏఐ యుగం వరకు మనిషి మేథస్సు ఎదిగిందన్నారు. ప్రపంచం ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఏఐ కంట్రోల్ మనిషిదే అయి ఉండాలి. ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణకు ఈ వేదిక దోహదం చేస్తుందన్నారు. ఏఐ విజన్తో పాటు, సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యమన్నారు.
ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్ కే కాదు.. దక్షిణాసియాకే గర్వ కారణమన్నారు. యువత ఇప్పుడు ఏఐని ప్రయోజనకరంగా ఉపయోగిస్తోందన్నారు. ఏఐ కూడా కత్తికి రెండు వైపుల పదునున్న అస్త్రమన్నారు.
