HYD | నగరంలోని ప‌లు చోట్ల మోస్తరు వర్షం..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో నగరంలోని ప‌లు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. సాయంత్రం సమయంలో హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో వర్షం మొదలైంది.

ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్టుమెంట్ (IMD) ప్రకారం, రాత్రి 9 గంటల తర్వాత కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

వర్షం కారణంగా కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ నెమ్మదిగా సాగడం వాహనదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.

Leave a Reply