హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
నిజామాబాద్ , ఆదిలాబాద్ , కరీంనగర్ , మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుని ప్రచార సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ సభలో మాట్లాడతారు.