పెద్దవాగులో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పెద్దవాగులోకి రైతుల కోసం నీళ్లు విడుదల చేయించినందుకు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి శనివారం పాలాభిషేకం జరిగింది. గంగమ్మకు పసుపు కుంకుమలతో పూజలను కూడా నిర్వహించారు.

మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, జిల్లా పార్టీ కార్యదర్శి ఎండి జైనుద్దీన్,కౌన్సిలర్లు పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, జెట్ట నీరజ, మల్లెల సరిత, వానరాశి మరియమ్మ, నాయకులు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, ఎండి సలీం, దూసరి మురళీధర్, ఎగ్గిడి శ్రీశైలం, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్, మహేష్,పోరళ్ల సతీష్, దూడల రాజశేఖర్ గౌడ్, మార్క్, పర్రె రమేష్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply