MLA | గ్రామ అభివృద్ధి నా లక్ష్యం

MLA | గ్రామ అభివృద్ధి నా లక్ష్యం

MLA | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పత్లలాపూర్ సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి నా లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kantharao), మాజీ ఏఎంసీ చైర్మన్ నాగనాథ్ పటేల్ సహకారంతో గ్రామం అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు.

మొదటగా ప్రధానోపాధ్యాయులు ఈర్షద్ సర్పంచ్ పద్మిని బాయి మారుతి, ఉప సర్పంచ్ జె రాజకుమార్ వార్డు సభ్యులు అనిత అశోక్, బసవరాజ్, సర్వర్, మల్లికార్జున్, శ్యామల గంగారం, జి మారుతి, ఎం గంగాధర్, అంజవ్వ రాములు, సురేఖ సాయిలు, శ్రీమతి పద్మ లను ప్రమాణస్వీకారం చేయించారు. గ్రామ పెద్దలు సిద్ధపపటేల్, అందరి సహకారంతో గెలిపించినందుకు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామం అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నూతన పాలకవర్గాన్ని శాలువతో సన్మానించారు.

Leave a Reply