భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని పలువురు కుటుంబాలను బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరామర్శించారు. భీంగల్ చేరుకున్న ఎమ్మెల్యే, ఇటీవల మరణించిన లింబాద్రిగుట్ట ధర్మకర్త నంబి లింబాద్రి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
తరువాత బీఆర్ఎస్ కార్యకర్తలు రాజేష్ (లడ్డు), రఘు కుటుంబాలను సందర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు.
ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు గున్నాల భగత్, బోదిరె నర్సయ్య, సతీష్ గౌడ్, మల్లెల ప్రసాద్, పర్శ నవీన్, ఇక్స్రమ్, మొయిస్, లాల్, సాగర్ తదితరులు ఉన్నారు.

