శ్రీ షిర్డీసాయి బాబా సేవలో ఎమ్మెల్యే వసంత

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : శ్రీ షిర్డీసాయి బాబా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు. కొండపల్లి పట్టణంలోని బీ కాలనీ వద్ద శ్రీ షిర్డీ సాయి బాబా మందిరం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఆయన సాయిబాబాను దర్శించుకున్నారు.

ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయిబాబా ఆశీస్సులు అందజేశారు. ఎమ్మెల్యే వసంతను ఆలయ ధర్మకర్త పామర్తి రాంబాబు దుశ్శాలువాతో సత్కరించి సాయిబాబా చిత్రపటాన్ని బహుకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతాలకు అతీతంగా సాయిబాబా మందిర వార్షికోత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు అడపా వెంకయ్య నాయుడు, చుట్టుకుదురు వాసు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కరిమికొండ బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply