నిరాడంబరంగా ఎమ్మెల్యే వసంత జన్మదినోత్సవం…

నిరాడంబరంగా ఎమ్మెల్యే వసంత జన్మదినోత్సవం…
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామం ఐతవరంలోని నివాసంలో గురువారం నిరాడంబరంగా జరిగాయి. ఉదయాన్నే ప్రత్యేక పూజల్లో మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వారి సతీమణి శిరీష, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేకు కట్ చేశారు. స్థానికులు, గ్రామస్థులు, ఆత్మీయులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, కూటమి నాయకులు, టీడీపీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వసంతను స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేకులు కట్ చేయించారు. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జమలాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో, మైలవరం పట్టణంలోని అన్ని దేవాలయాల్లో వసంత జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు చేశారు.



