మక్తల్, మార్చి 14 (ఆంధ్రప్రభ) : హోళీ పండుగ సంబరాలు ఇవాళ మక్తల్ పట్టణంలో ఘనంగా జరిగాయి. సంబురంగా సాగిన హోళీ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, యువకులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఎమ్మెల్యే రంగులు చల్లుకొని నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద అందరికీ రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మొదటిసారి ఎమ్మెల్యే హోళీ వేడుకల్లో పాల్గొనడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… హ్యాపీ హోళీ.. హ్యాపీ మక్తల్ అంటూ ఎమ్మెల్యే నినాదాలు చేయించారు. ఈసందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోళ్ల వెంకటేష్, కట్ట సురేష్ కుమార్, బి.గణేష్ కుమార్, బీజేపీ నాయకులు కర్ని స్వామి, జి.బలరాం రెడ్డి, చెడ్డిగ్యాంగ్, జిజెసి మిత్రులు డా.శ్రీరామ్, అనుకొండ జగదీష్, రుమాళ్ళ రాజశేఖర్, బి.శ్రీనివాసులు, బి .ఆంజనేయులు, సూర్య, శ్రీధర్, బి.రఘునాథ్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.