ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలు భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యచరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడే ను పురస్కరించుకొని జుక్కల్ మండల కేంద్రంలోని ఆక్సిజన్ పార్కులో జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్, అధికారులు,కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చెట్లకు నీరు అందించారు. ప్రగతి ప్రణాళిక ప్రాధాన్యతను, ముఖ్య లక్ష్యాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని 99 రోజుల బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బిశ్రీనివాస్ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
