SHOCK | మృతుని కుటుంబానికి అండ‌గా ఉంటాం

జేసీబీ డ్రైవర్ భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

SHOCK |ఏలూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : ఏలూరు నగరపాలక సంస్థలో సీహెచ్ రమేష్(35) అవుట్ సోర్సింగ్ జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఏలూరు అశోక్ నగర్ స్మృతి వనంలో జేసీబీతో శుభ్రం చేసే పనులు చేస్తుండ‌గా విద్యుత్ వైర్లు తగిలి షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం భౌతిక కాయం వ‌ద్ద‌ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) నివాళులర్పించారు. అనంతరం రమేష్ కుటుంబానికి అండగా ఉంటామ‌ని భరోసా కల్పించారు.

Leave a Reply