ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన సన్మానం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణను ఆర్టిఐ ప్రచార కమిటీ ఫౌండర్ & చైర్మన్ రాచూరి మల్లికార్జున్, ఎక్స్ ప్యాక్స్ చైర్మన్ & కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి ఘనంగా సన్మానించారు. బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో 63 ఎకరాల 18 గుంటల భూమికి సంబంధించిన మ్యూటేషన్, భూసర్వే సమస్యలను పరిష్కరించి 35 మంది దళిత లబ్ధిదారులను పట్టాదారులుగా మార్చినందుకు ఈ సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఎన్నికల హామీ మేరకు ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించి న్యాయం చేశారని పేర్కొన్నారు. భూములకు విద్యుత్ సౌకర్యం, వ్యవసాయ బావులు కల్పించాలని విన్నవించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. మండలంలోని ఇతర పెండింగ్ భూ సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సముద్రాల లక్ష్మణ్, రెడ్డిగాని రాజు, మామిడి అనిల్, మీసాల అంజయ్య, బోయిని కొమురయ్య, ఎలుక రాజు, మాతంగి లక్ష్మణ్, కన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
