MLA | అన్ని విధాల అండగా నేనున్నా…

MLA | అన్ని విధాల అండగా నేనున్నా…
MLA | జైనూర్, ఆంధ్రప్రభ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఈ రోజు ఆసిఫాబాద్(Asifabad)లోని తన నివాసంలో సిర్పూర్ (యు) మండలం పంగిడి గ్రామానికి చెందిన తెలంగాణ ఆనాటి ఉద్యమకారుడు స్వర్గీయ గేడం మారుతి తనయుడు బీజేపీ పార్టీ నాయకుడు గేడం మోహన్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kovalakshmi) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మోహన్ కు పార్టీ కండువేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గేడం మారుతి బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో చురుకుగా పాల్గొని ఉద్యమాల్లో పాల్గొన్నారని బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి గుర్తు చేశారని ఆమె అన్నారు. తండ్రిలాగా తనయుడు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.
అన్ని విధాల అండగా నేనున్నానని ఎమ్మెల్యే కోవలక్ష్మి భరోసా కల్పించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం(Power)లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు మరసుకోల సరస్వతి, జైనూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత రావు, సిర్పూర్(యు) బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అర్క నాగోరావ్, మడవి బోజ్జి రావు, కొట్నక్ భీమ్రావు, మడవిదేవరావు, శివాజీ, మధుకర్, హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
