హైదరాబాద్ : బీఆర్ఎస్ సభపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా జనం వస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ ను చూసేందుకు జనం ఎక్కువగా వస్తారని పేర్కొన్నారు. ఇక ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్ లో తప్పు ఏమి లేదని.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ఆమె రీ ట్వీట్ మాత్రమే చేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్టు లేదన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
MLA | దానం యూటర్న్.. కేసీఆర్ పై ప్రశంసలు.. స్మితా సబర్వాల్ కు మద్దతు
