ఉట్నూర్, జులై 11 (ఆంధ్రప్రభ ) : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూర్ మండలంలోని ఘన్ పూర్ గ్రామానికి చెందిన కోవ శ్యామల తల్లిదండ్రులు కోవ లచ్చు, రూపాబాయి ఏడాది కాలంలో ఇద్దరు మృతి చెందారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా శ్యామల (Shyamala) ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను కలసి తన గోడును వినిపించింది.
వెంటనే స్పందించిన వెడ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు – ఎమ్మెల్యే బొజ్జు పటేల్ (MLA Bojju Patel) తనవంతుగా 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అధైర్య పడొద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అత్రం రాహుల్, నాయకులు, యువతీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.