• ఎమ్మెల్యే అనిల్‌జాద‌వ్ ముంపు గ్రామాల‌ ప‌రిశీల‌న‌


ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ (Anil Jadhav) ఈ రోజు మహారాష్ట్ర సరిహద్దు పెన్ గంగా నది తీర గ్రామాల్లో ప‌ర్య‌టించి వర‌ద ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. బుర‌ద‌లో బైక్ మీద ప్ర‌యాణం చేస్తూ బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. భీంపూర్ మండలం (Bhimpur Mandal) లోని మారుమూల గిరిజన గ్రామాలైన కరంజి, గోమూత్రి, అంతర్గావ్, అర్లీ, వడూర్, గుబిడి, ధనోరా, బీంపూర్ , కరణ్ వాడి ముంపు ప్రాంతాల్లో పంట నష్టం పై ఆరా తీశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రైతులు అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. నీట మునిగి పంట నష్టపోయిన రైతులకు (farmers) ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ (demand) చేశారు. ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం అందించి కోరారు. పంట నష్టం అంచనా వివరాలతో త్వరలో సీఎంని కలుస్తానని చెప్పారు.

Leave a Reply