MLA | నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తాం..

MLA | నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తాం..
- పీసీఆర్ కూడలిలో పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభం.
MLA | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా చిత్తూరు పీసీఆర్ కూడలిలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ ను మంగళవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరాన్ని సుందరంగా ఉంచడంలో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని నగర ప్రజలు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎక్కడబడితే అక్కడ మూత్ర విసర్జన చేయకుండా పబ్లిక్ టాయిలెట్స్ వినియోగించుకొని.. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు తోడ్పాటు అందించాలన్నారు.

కమిషనర్ పి నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ.. నగరంలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం పే అండ్ యూస్ పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ర్యాంకు సాధిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్వో డా.లోకేష్, ఎంఈ వెంకటరామి రెడ్డి, సీఎంఎం గోపి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
