MLA | గ్రామానికి సోలార్‌తో నిత్యం వెలుగులు

MLA | గ్రామానికి సోలార్‌తో నిత్యం వెలుగులు
- సోలార్ స్కీంను ప్రారoభించిన సర్పంచ్ నలిమేల రాజు
MLA | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహాకారంతోనే వెంకట్రావ్ పేట్ లో మోడల్ సోలార్ విలేజ్ స్కీం సాధ్యమైందని ఆ గ్రామ సర్పంచ్ నలిమేల రాజు అన్నారు. ఈ రోజు గ్రామంలో పీ జీ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో సుమారుగా 1160 సోలార్ కనెక్షన్స్ కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ… ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దత్తత గ్రామంగా స్వీకరించి నేడు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
రూ. 20 కోట్ల విలువ గల సోలార్ కనెక్షన్స్ గ్రామంలో ఏర్పాటు చేయడం మనకు ఎంతో మేలు చేస్తుందన్నారు. నాణ్యమైన విద్యుత్ వాడకం అలాగే మిగులు విద్యుత్ తో వినియోగదారులకు మేలు జరుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా పని చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ ప్రభాకర్, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, ఏఈ గణేష్, ఉప సర్పంచ్ కోన తిరుమల, వార్డ్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

