MLA | అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు

MLA | అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
MLA | చండూర్, ఆంధ్రప్రభ : చండూర్ అభివృద్ధికే నా మొదటి ప్రాధాన్యత.. నన్ను గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎక్కడివరకైనా వెళ్తా.. చండూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన మెయిన్ రోడ్డు(సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు) అభివృద్ధి పనులతో పాటు సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చింది. నా రాజీనామా వల్లే అభివృద్ధి మునుగోడు ప్రజలు నాపై నమ్మకంతో నన్ను గెలిపించారు.
పదవిలో ఉండి కొట్లాడితే అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు ఒక్క రాజీనామాతో ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరకి వచ్చింది… 2018 ఎన్నికల్లో మొదటిసారి నన్ను అసెంబ్లీ పంపించారో అప్పటి నుండి మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతున్న మునుగోడు ప్రజలతో నాకు అవినాబావ సంబందం వుంది… చండూర్ చరిత్రలో నిలిచిపోయే రోడ్డు ఇది… 100 పడకల అస్సుపత్రి కట్టిస్తాం… చండూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి ఇంకా చేయాల్సి వుంది… ఇంకా మూడు సంవత్సరాల కాలం వుంది… చేయాల్సిన అభివృద్ధి చాలా వుంది… హైదరాబాద్ తరహాలో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాను… కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చేందుకు డబ్బులు లేవు… నాకు పదవి మీద వ్యామోహం లేదు.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తాను. ఇంకా మూడేళ్ళ సమయం వుంది.. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని ఆయన తెలిపారు.
