MLA | గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ..

MLA | గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ..
MLA | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలోబెంగళూరు, విజయవాడ మధ్య నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ఎకనామిక్ కారిడార్ పనులను పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హైవే నిర్మాణ పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పనుల నాణ్యత, వేగం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కరీ దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలను చేపట్టడం హర్షణీయమన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడటమే కాకుండా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలో ఈ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరగడం గర్వకారణమన్నారు. ప్రధానంగా పూణే కు చెందిన రాజ్ పత్ ఇన్ఫ్రా కాన్ సంస్థ హైవే నిర్మాణంలో భాగంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కేలా నాలుగు రికార్డులు నమోదు కావడం అభినందనీయమని అన్నారు.
ఇది జిల్లాకు మాత్రమే కాకుండా రాష్ట్రానికి కూడా మంచి గుర్తింపునిస్తుందని తెలిపారు. ఇందుకు సంస్థ అధినేత జగదీష్ కదంకు వారి సిబ్బందికి, కార్మికులకు అభినందనలు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను నిర్ణీత గడువులో వేగంగా పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడంలో కీలక పాత్ర పోషించిన రాజపత్ ఇన్ఫ్రా సంస్థకు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. రవాణా సౌకర్యాలు మెరుగుపడి వ్యాపారం, పరిశ్రమలు, పర్యాటక రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
