MLA | రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

MLA | రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
- రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించండి
- ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
MLA | ఓర్వకల్, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమమే పూటను ప్రభుత్వ ధ్యేయమని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనని నంద్యాల టిడిపి అధ్యక్షులు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి అన్నారు. ఈ రోజు కర్నూలు జిల్లా ఓర్వకల్ మండల కేంద్రంలో కంది పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఎమ్మెల్యే వెంట నంద్యాల పార్లమెంట్ ఉపాధ్యక్షులు గోవిందరెడ్డి, ఓర్వకల్ టీడీపీ మండల కన్వీన నాగిరెడ్డి, ఓర్వకల్ మండల టీడీపీ కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, ఓర్వకల్ సహకార సంఘం చైర్మన్ సుధాకర్ రావు. హుసేనాపురం సహకార సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గుట్టపాడుసర్పంచ్ మోహన్ రెడ్డి, ఏవో మధుమతి, ఎంపీడీవో నాగ అనసూయ ఉన్నారు.
ఎమ్మెల్యేకు టిడిపి నాయకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్న అన్నారు. రైతులకు కంది పంట కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సాహకార కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఇప్పటికే రైతుల కోసం లోన్లుఇవ్వడం జరిగిందన్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతుల పంట నమోదును సక్రమంగా చేయాలని కోరారు. ఇప్పటికే పంట నమోదు పూర్తి చేయడం జరిగిందని అన్నారు.
కొనుగోలు కేంద్రాలలో కందులు అమ్మాలనుకునే రైతులు పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. టీడీపీ నాయకులు, అధికారులు మాట్లాడారు. అనంతరం కందుల కొనుగోలు కేంద్రాన్ని పూజలు చేసి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు సమావేశానికి మండల టీడీపీ అధ్యక్షుడు నాగిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తదితర గ్రామాల టీడీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు.
