MLA | కోటి అంచనా నిధులతో…

MLA | కోటి అంచనా నిధులతో…

  • సీసీ రోడ్డు నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే శంకుస్థాపన..
  • దాసాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు..
  • ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు…
  • దాసాంజనేయ ఆలయ కమిటీ..

MLA | వైరా, ఆంధ్రప్రభ : వైరా రిజర్వాయర్ చెరువు కట్ట అలుగుల వద్ద దాసాంజనేయ స్వామి దేవాలయం నుండి సబ్ స్టేషన్ వరకు కోటి రూపాయల నిధుల అంచనాతో సీసీ రోడ్డు కల్వర్టు నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఈ రోజు మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. మొద‌ట‌ ఆయన దాసాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ శాఖ ఆర్ అండ్ బీఐబీ శాఖల అధికారులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, రాష్ట్ర మార్క్ పెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, వైరా మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎదునూరి సీతారాములు, శీలం వెంకట నర్సిరెడ్డి, దాసాంజనేయ దేవాలయ కమిటీ, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply