MLA | పీజీఆర్ఎస్ను సద్వినియోగించుకోవాలి

MLA | పీజీఆర్ఎస్ను సద్వినియోగించుకోవాలి
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరణ
MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారమయ్యేలా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. గుడివాడ పట్టణంలో ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం (ప్రజా వేదిక)లో ప్రజల నుంచి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు.
న్యూ ఇందిరా నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య, పిన్నమనేని నగర్ లో వాటర్ పైప్ లైన్ సమస్యపై… స్థానికులు ఇచ్చిన అర్జీల మేరకు మున్సిపల్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే .. సమస్య పరిష్కార చర్యలు సూచించారు. ప్రతి అర్జీను పీజీఆర్ఎస్లో నమోదు చేసి సత్వర పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ ప్రసాద్, తహసీల్దార్ కుమార్, మున్సిపల్ డీఈ కరుణ్ బాబు, సమ్మెట బ్రహ్మాజీ, మున్సిపల్ ఏఈ శ్రావణ్, ఆర్డబ్ల్యూసీ ఏఈ కిస్మత్ రాణి, తదితరులు పాల్గొన్నారు.
