MLA | లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు

MLA | లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు

  • ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

MLA | ఆంధ్రప్రభ, గన్నవరం : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న సంస్కరణల వల్ల విద్యారంగం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkat Rao) తెలిపారు. మెగా పేటీఎం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మండల పరిధిలోని గొల్లనపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పీఎం శ్రీ లేబరేటరీని, క్రీడా మైదానంలో నూతనంగా నిర్మించిన ఆరు కోర్టు(Six courts)లను యార్లగడ్డ ప్రారంభించారు.

MLA

అనంతరం జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ ఏడాది జులై నెలలో తొలిసారిగా నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్(Teacher meeting) కు రాష్ట్రవ్యాప్తంగా 2.28 కోట్ల మంది హాజరై రికార్డ్ సృష్టించిన సంగతి గుర్తు చేసారు. కేవలం ప్రైవేటు పాఠశాలల్లో ఉండే పేరెంట్ టీచర్ మీటింగ్ ను ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయటం అభినందనీయమన్నారు.

MLA

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వివరించేందుకు వీలు కలుగుతుందన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు ఎరిగి విద్యార్థులు చక్కగా చదువుకోవాలని సూచించారు. చదువుకునే వయసులో ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టి చదువుని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం కష్టపడాల్సి ఉంటుందని విద్యార్థులను హెచ్చరించారు. విద్యార్థులు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని తద్వారా పోటీ పరీక్షల్లో పాల్గొనటం సులభతరంగా ఉంటుందన్నారు.

గన్నవరం నియోజకవర్గంలో అదనపు తరగతి గదుల నిర్మాణం, టాయిలెట్స్ నిర్మాణం, ఆర్వో ప్లాంట్ ల ఏర్పాటు, పాఠశాలల రిపేర్లు కోసం రూ. 11.02 కోట్లు నిధులు మంజూరు చేసిన మంత్రి లోకేష్ కు ఈ సందర్భంగా యార్లగడ్డ ధన్యవాదాలు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం ద్వారా గన్నవరం నియోజకవర్గంలోని 15,092 మంది విద్యార్థులకు రూ 3.77 కోట్లు, తల్లికి వందనం ద్వారా 46,907 మంది విద్యార్థులకు రూ. 70.36 కోట్లు ఇచ్చినట్లు యార్లగడ్డ వివరించారు.

MLA

ఈ కార్యక్రమంలో ఏం సీమాజీ చైర్మన్ కోటగిరి వరప్రసాద్, గ్రామ సర్పంచ్ గణపవరపు శాంతి, ఎంపీటీసీ మొరం నాగరాణి, మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, నాయకులు చిరుమామిళ్ల సూర్యం, బోయపాటి బుల్లయ్య, చిట్టీనేని జోజి, యనమదల సతీష్, బోడపాటి రవి , మేడేపల్లి రమ, దాసరి విజయ రావు, అంకెం రామారావు, కొలుసు రాంబాబు, గోగం బాలాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొల్లి సత్య జగదీశ్వరరావు తదితరులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply