MLA | కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

MLA | కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్వ గ్రామం వేల్పూర్ లో ఈ రోజు బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం వేల్పూర్ మండల కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. పని చేసే నాయకులను ప్రజలు ఎన్నుకోవడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అవినీతికి ఆస్కారం లేని యువతకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a Reply