MLA | 24 గంటల్లోనే డ‌బ్బులు…

MLA | 24 గంటల్లోనే డ‌బ్బులు…

  • ధాన్యం కొనుగోలు సొమ్ము జమ
  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

MLA | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమయ్యేలా కూటమి సర్కారు చర్యలు తీసుకుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ (Vijayawada) రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఈ రోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రైతులు (Farmer) తమ వివరాలను నమోదు చేసుకోవడానికి “7337359375” వాట్సాప్ నంబర్‌కు “హాయ్” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించామ‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply