MLA | మధుర జ్ఞాపకం..

MLA | మధుర జ్ఞాపకం..
MLA | ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జన్మించిన ఇల్లును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ప్రస్తుతం కృష్ణారావు సోదరుడు నీలాంబరరావు సతీమణి కోటేశ్వరమ్మ నివసిస్తున్నారు. తన తండ్రి జన్మించిన గృహాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, కృష్ణారావు మరొక సోదరుడు మండలి జనార్ధనరావు తనయుడు మండలి ఉదయ భాస్కర్ సందర్శించారు. ఎమ్మెల్యే తన తండ్రి జన్మించిన ఇంటిని పరిశీలించి గత స్మృతులు స్మరించుకున్నారు. తమ పిన్ని కోటేశ్వరమ్మతో ముచ్చటించి చిన్ననాటి స్మృతులు జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
