మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు….

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు….

  • నివాళులర్పించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం – ఆంధ్రప్రభ : సమాజంలో సమానత్వం, విద్యా, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. శనివారం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు శతాబ్దాల క్రితమే పూలే సమానత్వం, విద్య కోసం పోరాడారని, ఆయన ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని అన్నారు. పూలే చూపిన దారిలోనే సాగుతూ, స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే రాష్ట్రంలో బీసీలకు నిజమైన రాజ్యాధికారం లభించిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి ముందు వరకు అధికార వ్యవస్థ కొద్ది వర్గాలకే పరిమితమై ఉండేదని, మండల వ్యవస్థను ప్రవేశపెట్టి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని వివరించారు.

అంతకుముందు ఉన్న రాజరిక, వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలికి, సాధారణ ప్రజలు కూడా మంత్రుల స్థాయికి ఎదగగలిగే పరిస్థితులు ఏర్పరిచిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తితోనే బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, కూటమి నాయకులు కొండేటి వెంకటేశ్వరరావు, మోదుగుమూడి సత్యనారాయణ, జొన్నలగడ్డ సుధాకర్, కంభంపాటి లక్ష్మి నరసమ్మ, బోడపాటి రవి, మల్లారెడ్డి కిషోర్, జాస్తి శ్రీధర్, తుల్లిమిళ్ళి ఝాన్సీ, పాలడుగు వెంకట వరప్రసాద్, జాస్తి మురళి, కానూరు శేషు మాధవి, చిమట రవి వర్మ, అన్నే హరి కృష్ణ , మండాది రవీంద్ర, బుస్సే నాగ ప్రసాద్, కొసరాజు సాయిరాం, వలివేటి కిషోర్, మద్దినేని వెంకటేశ్వరరావు, తిరువీధి నరేష్, బుస్సే సరిత, జాస్తి రేణుక , అన్నే ధనలక్ష్మి, కాగితాల నాగరాజు, మణిమాల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply