ఉట్నూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఉట్నూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చౌక్ లో జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలోభారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, సీనియర్ నాయకులు శ్రీరాం నాయక్, బానోత్ జగన్ అడ్వకేట్ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాథోడ్ శేషారావు, సాడిగ రాజేశ్వర్ మాజీ ఎంపిటిసి కందుకూరి రమేష్ సీపతి లింగాగౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ రాజకుమార్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బొడ్డు కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి కాల్వ రవి, మండల ఉపాధ్యక్షులు అర్జున్ సింగ్, బీజేవైఎం మండల్ అధ్యక్షులు సానా గోపికృష్ణ, నాయకులు సత్యనారాయణ, చింతల రమణ, రామగిరి వేణు,పెంట కైలాస్,పందిరి నర్సయ్య, కుటికెల రమేష్, పులి శ్రీకాంత్, పొన్నం జగన్, కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
