వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాజ్యసభ సభ్యులు వెం నరేందర్ రెడ్డిని సోమవారం హైదరాబాద్ లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, కొనసాగుతున్న పలు కార్యక్రమాలపై వారు చర్చించారు. కేంద్ర సహాయంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి కూడా వివరించారు.
ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ… ప్రజల సంక్షేమం కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అవసరమని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు నరేందర్ రెడ్డి సమస్యలను పరిష్కరించేందుకు తగిన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చాడ రఘునాథ రెడ్డి, రాష్ట్ర నాయకులు కటంగురి రామ్ నరసింహ రెడ్డి, మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి రామేశ్వర రావు, తదితరులు ఉన్నారు.
