సుజనా చౌదరి కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి..

సుజనా చౌదరి కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి..

భవానిపురం, ఆంధ్రప్రభ : భవానీ పురం లోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో పొట్టి శ్రీరాములు 125 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి శ్రీరాములుకు ఘన నివాళులు అర్పించారు.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మ త్యాగాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అజీజ్, ఈగల సాంబశివరావు, రాంబాబు, బీజేపీ నాయకుడు హరి ప్రసాద్, దాసరి బుజ్జి, సుజనా మిత్ర కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Leave a Reply