ఉగాది విశిష్ట పురస్కారానికి బుద్ధప్రసాద్…

ఉగాది విశిష్ట పురస్కారానికి బుద్ధప్రసాద్…
ప్రకటించిన కలకత్తా ఆంధ్ర సంఘం
ఈ నెల 29వ తేదీ పురస్కారం అందుకోనున్న బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : కలకత్తా ఆంధ్ర సంఘం వారి ఉగాది విశిష్ట పురస్కారానికి అవనిగడ్డ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాల చైర్మన్, రాష్ట్ర అసెంబ్లీ నైతిక విలువల కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఎంపికయ్యారు. కలకత్తా ఆంధ్ర సంఘం 90వసంతాల తెలుగు వెలుగులు కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలు పురస్కరించుకొని బుద్ధప్రసాదుకు “ఉగాది విశిష్ట పురస్కారం” ప్రదానం చేయనున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తులలో ఒకరిగా, విద్యా, సాంస్కృతిక రంగాలలో చేస్తున్న నిరంతర కృషి, తెలుగు భాష వికాసానికి అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించనున్నట్లు తెలిపారు.
