క్షేమంగా వెళ్లి లాభంగా రండి..

క్షేమంగా వెళ్లి లాభంగా రండి..

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: భక్తి, ఐక్యత, ఆనందోత్సాహాల నడుమ నిర్వహించబడే కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం జాతరకు వివిధ గ్రామాల నుండి ప్రభ బండ్లతో బయలుదేరే భక్తులకు పెద్దలకు, నర్సంపేట డివిజన్ లోని నాయకులకు హృదయపూర్వక పిలుపునిచ్చారు.


క్షేమంగా వెళ్లి, లాభంగా తిరిగి రండి… భక్తి మార్గంలో అడుగులు వేయండి గాని, గొడవల దారిలో కాదు అనే సందేశంతో ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రభలు కట్టుకొని స్వామి దర్శనానికి బయలుదేరే వారు ఆనందంతో పాటు బాధ్యతను కూడా మోసుకెళ్లాలని సూచించారు.


జాతర అనేది కేవలం ఉత్సవం మాత్రమే కాదని, అది మన సంస్కృతి, సంప్రదాయం, గ్రామ ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామం వరకు వచ్చే ప్రభ బండ్ల మధ్య పరస్పర గౌరవం ఉండాలని, ఎలాంటి కక్షలు, వివాదాలు, మాటల పట్టింపులు చోటుచేసుకోకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి అపార్థాలు పెద్ద గొడవలకు దారి తీసే ప్రమాదం ఉందని, అందుకే సహనం, సమన్వయం అవసరమని గుర్తుచేశారు.


భక్తి భావంతో స్వామి సన్నిధికి చేరే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా దర్శనం చేసుకుని, తమ కుటుంబాల కోసం, గ్రామాల కోసం శ్రేయస్సు కోరాలని సూచించారు. యువత ముఖ్యంగా నియంత్రణతో ఉండి, పెద్దల మాట వినాలని, ఉత్సాహం ఉన్మాదంగా మారకుండా జాగ్రత్త పడాలని కోరారు.


స్వామి ఆశీస్సులతో వెళ్లి, సురక్షితంగా తిరిగి రావాలి. మన గ్రామ గౌరవం మన చేతుల్లోనే ఉంటుంది, అని పెద్దలు పేర్కొన్నారు. భక్తి పథంలో నడుస్తూ ఐక్యతను చాటుకుంటేనే జాతర మహిమ మరింత వెలుగొందు
తుందని తెలిపారు.


కొమ్మాల జాతర భక్తుల ఆనందోత్సాహాలకు వేదికగా నిలవాలని, ప్రతి ప్రభ బండి క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని కోరారు. నర్సంపేట నియోజకవర్గంలో హోలీ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కలిసి రంగుల హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్సాహ భరితమైన నినాదాలు, రంగుల చిలకరింపులు, హర్షధ్వానాల మధ్య నర్సంపేట పట్టణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ జరుపుకునే ఈ రంగుల పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు,


కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హోలీ సంబరాలను ఉత్సాహంగా పాల్గొన్నారు, రంగుల సందడి మధ్య పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

Leave a Reply