MLA | మాజీ ఎమ్మెల్యే గండ్రను కలిసిన నూతన సర్పంచ్..

MLA | రేగొండ, ఆంధ్రప్రభ : మొదటి విడత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సర్పంచ్, వార్డ్ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సన్మానించారు. రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 154 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, శనివారం మాజీ ఎమ్మెల్యే గండ్రను కలవడంతో శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికార పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని, అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేయడం వల్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి విజయం దక్కింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దగ్గు వెంకటేశ్వరరావు, బండి రమేష్, బింగి భిక్షపతి, కొత్తపల్లి సాంబయ్య, చిలువేరు భిక్షపతి, మరిగిద్ద భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply