ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన వినయ్

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన వినయ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – లక్ష్మి దంపతులను సోమవారం వారి నివాసంలో చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో వెళ్లి కలిశారు.
తను మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడానికి పూర్తి సహకారం అందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులకు వినయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే దంపతులకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోశిక శ్రీకాంత్, బత్తుల యశ్వంత్, గంజి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
