Mla | ప్రజా పాలనలో అందరికి ఉచిత విద్యుత్ అందిస్తాం….

Mla | ప్రజా పాలనలో అందరికి ఉచిత విద్యుత్ అందిస్తాం….
అర్హులైన వారికి ఉచిత విద్యుత్తు అందిస్తాం.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు
గంగాపూర్ లో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
Mla | కడెం, ఆంధ్రప్రభః ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఉచిత విద్యుత్తు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు అన్నారు. కడెం మండలం గంగాపూర్ (దత్తోజీపేట) గ్రామంలో మూడు కోట్ల వ్యయమంతో నిర్మాణం చేపట్టనున్న 33/11 కెవి ఉప విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మాణానికి నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులతో కలసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అలాగే కుర్ర తండ జిపి పరిధిలో గల దుబ్బ తండాలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న అంగన్వాడి భవనం పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
అడుగడుగున ఖానాపూర్ నియోజకవర్గం అబివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే వేడమ బొజ్జు అన్నారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందిస్తామని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పతకాలు అందిస్తున్నామన్నారు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ , మహిళలకు ఉచిత బస్సు ఆర్ధికంగా మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్షం అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జుకు విద్యుత్ శాఖ ఎస్ ఈ చవాన్ డి ఈ తిలక్, ఖానాపూర్ ఏడిటి శ్రీనివాస్, కడం ఏఈ ఏం రాంసింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.
కడెం మండలంలోని గంగాపూర్ రాణి గూడా కుర్ర తండా జిపి పరిధిలోగల నేలకుని ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని పై జిపిల ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామస్తులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమా బొజ్జుకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన సమస్య కడెం వాగుపై వంతెన నిర్మాణం పనులు ఆగిపోవడం జరిగిందని పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పనులు అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని అలాగే గంగాపూర్ లో గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని వారు ఎమ్మెల్యేకు కోరారు. పై సమస్యలపై స్పందించిన ఖానాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాన సమస్య అయిన కడెం వాగుపై వంతెన నిర్మాణం పనులపై దృష్టి సారించామని ఈ వంతెన నిర్మాణం పనుల కోసం తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అలాగే తాము ఇచ్చిన హామీ పనులు దశలవారీగా పూర్తి చేసి పై మారుమూల గ్రామాలకు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషన్, విద్యుత్ శాఖ కన్స్ట్రక్షన్స్ఎస్ ఈ చవాన్ డి ఈ తిలక్, ఖానాపూర్ ఎడిటి శ్రీనివాస్, కడెం మండలం ఏఈ ఎం రాంసింగ్, గంగాపూర్ రాణి గూడ, కుర్ర తండా అల్లంపల్లి గ్రామాల సర్పంచులు వేడమ జంగు ఎం విజయలక్ష్మి తొడసం సీతారాం కాంత ఖానాపూర్ ఆత్మ డైరెక్టర్ జైల్ సింగ్ అల్లంపల్లి మాజీ ఎంపీటీసీ ఎం దాసు నాయక్ కడం మండల తహసిల్దార్ రోడ్డ ప్రభాకర్ ఎంపీడీవో జే సునీత పి ఆర్ ఏ ఈ చందన్ పంచాయతీ కార్యదర్శులు వాజిద్ షేక్ ఫిరోజ్ మాజీ సర్పంచులు శాంతా చంద్రహాస్ సదర్ లాల్ మీసాల రంభా దేవి అధికారులు నాయకులు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

