mla | కుటుంబ సమేతంగా యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

mla | కుటుంబ సమేతంగా యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే. దంపతులు
mla | ఉట్నూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారంసాయంత్రంమహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా యాదాద్రి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నరసింహ స్వామిని కోరుకున్నట్లు ఎమ్మెల్యేవెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.
