Mla | మోత్కూర్ లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మందుల సామెల్..

Mla | మోత్కూర్ లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మందుల సామెల్..

Mla | మోత్కూర్ , ఆంధ్రప్రభ; మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోత్కూర్ లోని జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 5 పోలింగ్ బూతులను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బుధవారం స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటింగ్ సరళి గురించి ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ కోసం ఓటర్లు సహకరించాలని కోరారు .అంతకుముందు ఎమ్మెల్యే కొండగడప పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం గాంధీనగర్ లో ,బి సి హాస్టల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన వెంట 1,2,3,4,7,10,12 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థులు పల్లెర్ల వెంకన్న, కురిమిళ్ళ ప్రమీల, ఎస్ మనోజ్,కస్తూరి జ్యోతి, గనగాని శైలజ,వర్రే మహేందర్ ,మెంట రమణ లు ఉన్నారు.

Leave a Reply