అధికారులను తప్పు దోవ పట్టించి…

అధికారులను తప్పు దోవ పట్టించి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : మాదాసి కుర్వ కులస్తులకు ఎస్సీ కుల దృవీకరణ పత్రం ఇవ్వద్దని నారాయణపేట (Narayanpet) ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కు ఈ రోజు నారాయణపేట జిల్లాఊట్కూర్ అంబేద్కర్ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొక్కుశంకర్, కార్యదర్శి కొండన్ భరత్(Kondan Bharat) తెలంగాణలో మాదాసి కుర్వ కులస్తులు ఎవరూ లేరని అన్నారు.

ఊట్కూర్‌లో కొంత మంది మాదాసి కుర్వలు అధికారులను తప్పు దోవ పట్టించి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు చూస్తున్నారని వివరించారు. అందుకు అదనపు కలెక్టర్(Collector) సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వినతి పత్రాన్ని పరిశీలించి అధికారులకు జారీ చేస్తున్నట్లు వారు విలేకరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు భక్కి తిమ్మప్ప, సంఘం నాయకులు కతలపొల్ల తిమ్మప్ప, నాగరాజ్, తల్వార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply